పెట్రోల్‌ కావాలా.. అయితే ఈ కండిషన్స్ పాటించాల్సిందేనట..!

| Edited By:

Apr 10, 2020 | 9:33 PM

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించింది. తాజాగా.. ఈ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే. అయితే ఇప్పుడు కరోనా నియంత్రణలో భాగంగా.. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా.. బయటికి వెళ్తే మాస్క్‌లు కంపల్సరీ చేశాయి ఇప్పటికే పలు రాష్ట్రాలు. తాజాగా.. […]

పెట్రోల్‌ కావాలా.. అయితే ఈ కండిషన్స్ పాటించాల్సిందేనట..!
Follow us on

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించింది. తాజాగా.. ఈ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే. అయితే ఇప్పుడు కరోనా నియంత్రణలో భాగంగా.. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా.. బయటికి వెళ్తే మాస్క్‌లు కంపల్సరీ చేశాయి ఇప్పటికే పలు రాష్ట్రాలు. తాజాగా.. ఒడిషా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పెట్రోల్ కావాలని బంక్‌ దగ్గరికి వెళ్తే.. మాస్క్ తప్పనిసరి చేసింది. పెట్రోల్, డిజీల్, గ్యాస్ కావాలంటే.. తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వెళ్లాల్సిందేనని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బంక్‌ల్లో ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.