Coronavirus: కోలుకున్న భార్య.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ప్రధాని..!

కరోనా మహమ్మారి బారిన పడిన కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.

Coronavirus: కోలుకున్న భార్య.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ప్రధాని..!

Edited By:

Updated on: Mar 30, 2020 | 4:14 PM

కరోనా మహమ్మారి బారిన పడిన కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే సోఫీ కోలుకున్నప్పటికీ.. ట్రూడో మాత్రం తన సెల్ఫ్ ఐసోలేషన్ కొనసాగిస్తున్నారు. కెనడా ఆరోగ్యశాఖ తెలిపిన అన్ని ప్రోటోకాల్స్‌ను తాము ఫాలో అవుతామని.. అందుకే మరికొన్ని రోజులు ఐసోలేషన్‌లో కొనసాగుతాయని ఆయన వివరించారు.

 

తన భార్య సోఫీకి కరోనా ఎప్పుడు అటాక్‌ అయ్యిందో వైద్యులు ఇంకా నిర్ధారించనందున.. మరో 14 రోజులు తాను ఐసోలేషన్‌లో ఉండాలని  నిర్ణయించుకున్నట్లు ట్రూడో వివరించారు. కాగా లండన్ పర్యటనకు వెళ్లి వచ్చిన ట్రూడో సతీమణి సోఫికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మార్చి 12న ఆమె క్వారంటైన్ కు వెళ్లగా.. వైద్యుల చికిత్సతో తాజాగా కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం నాటికి కెనడాలో కరోనా బాధితుల సంఖ్య 6,234కు చేరగా.. 64మంది మరణించారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: విజయ్‌ ఇంట్లో ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు..!