షాకింగ్.. అక్కడ బంగారాన్ని అమ్మేస్తోన్న ప్రజలు.. ఎందుకంటే..!

| Edited By:

Apr 16, 2020 | 8:08 PM

ప్రాణం మీదకు వచ్చినప్పుడు మన దగ్గరున్న ఏదైనా అమ్మేయాల్సిందే. ఇప్పుడు అదే పని చేస్తున్నారు థాయ్‌లాండ్ ప్రజలు. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి.

షాకింగ్.. అక్కడ బంగారాన్ని అమ్మేస్తోన్న ప్రజలు.. ఎందుకంటే..!
Follow us on

ప్రాణం మీదకు వచ్చినప్పుడు మన దగ్గరున్న ఏదైనా అమ్మేయాల్సిందే. ఇప్పుడు అదే పని చేస్తున్నారు థాయ్‌లాండ్ ప్రజలు. కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి.. చేతిలో డబ్బులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు  థాయ్‌లాండ్‌ ప్రజలు నగదు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. దానికి తోడు బంగారం రేటు పెరగడంతో.. వారు స్వర్ణాన్ని అమ్ముకునేందుకు ఎగబడుతున్నారు. బ్యాంకాక్‌లోని చైనాటౌన్‌లోని యోవారత్‌కు ప్రజలు పరుగులు పెడుతున్నారు.

దీంతో ఆ దేశ ప్రధాని  ప్రయూత్ చాన్-ఓచా స్పందించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం విక్రయిస్తే.. నగదు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, అవసరం మేరకే విక్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జనాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా స్థానిక అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. థాయ్‌లాండ్‌లో ఔన్స్‌ బంగారం ప్రస్తుతం 1,731 డాలర్లు పలుకుతోంది. గత ఏడేళ్లలో అక్కడ ఇదే అత్యధిక ధర కావడం విశేషం. మాస్కులు ధరించి మరీ పెద్ద ఎత్తున జ్యూవెలరీ షాప్‌లకు బారులు తీరుతున్నారు.