గ్రీన్ జోన్లలో బస్సులకు, లిక్కర్ షాపులకు అనుమతి.. రూల్స్ ఇవే..

|

May 01, 2020 | 9:38 PM

అనుకున్నట్లే జరిగింది. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలో ఉన్న రెడ్ జోన్లలో పూర్తిస్థాయిలో ఆంక్షలు ఉంటాయన్న కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం మినహాయింపులు ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో పాటుగా.. గ్రీన్ జోన్‌లో 50 శాతం సీటింగ్ క్యాపాసీటీతో బస్సు సర్వీసులు నడపవచ్చునని స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యక్తిగత ప్రయాణాలకు […]

గ్రీన్ జోన్లలో బస్సులకు, లిక్కర్ షాపులకు అనుమతి.. రూల్స్ ఇవే..
Follow us on

అనుకున్నట్లే జరిగింది. దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు అనగా మే 17 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలో ఉన్న రెడ్ జోన్లలో పూర్తిస్థాయిలో ఆంక్షలు ఉంటాయన్న కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం మినహాయింపులు ఇచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో పాటుగా.. గ్రీన్ జోన్‌లో 50 శాతం సీటింగ్ క్యాపాసీటీతో బస్సు సర్వీసులు నడపవచ్చునని స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యక్తిగత ప్రయాణాలకు ఆంక్షలు ఉండవండి.

మరోవైపు మందుబాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. గ్రీన్ జోన్లలో వైన్స్, పాన్ షాపులను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని.. ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఒకేసారి షాపు దగ్గర గుమిగూడవద్దని నిబంధనలు పెట్టింది.

Read This: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!