ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులు.. ఏవేవి తెరుచుకుంటాయంటే.?

ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండ‌టంతో ఏపీ స‌ర్కార్ మొద‌ట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్య‌తిరేకంగా త‌న వాణిని వినిపిస్తూనే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని స‌డ‌లింపులు క‌ల్పించడంతో..ఏపీ స‌ర్కార్ వాటిపై చర్చించి ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రెడ్ జోన్లు మినహించి.. మిగిలిన ప్రదేశాల్లో లాక్ డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే వీటిని ఉపయోగించుకోవడంతో పాటు […]

ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులు.. ఏవేవి తెరుచుకుంటాయంటే.?

Updated on: Apr 20, 2020 | 11:02 AM

ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండ‌టంతో ఏపీ స‌ర్కార్ మొద‌ట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్య‌తిరేకంగా త‌న వాణిని వినిపిస్తూనే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని స‌డ‌లింపులు క‌ల్పించడంతో..ఏపీ స‌ర్కార్ వాటిపై చర్చించి ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రెడ్ జోన్లు మినహించి.. మిగిలిన ప్రదేశాల్లో లాక్ డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే వీటిని ఉపయోగించుకోవడంతో పాటు మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులు ఇవే…

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు తెరుచుకోనున్నాయి
  •  రైస్, పప్పు, మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు లాక్ డౌన్ నుంచి మినహాయించారు
  • ఆర్వో ప్లాంట్లు, ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
  • సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు తెరుచుకోనున్నాయి
  • శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల పరిశ్రమలు
  • ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలు
  • ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…