కరోనా అప్‌డేట్స్: దేశంలో 3 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!

| Edited By:

Jun 13, 2020 | 2:45 PM

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఒక్కరోజులేనే 11,458 పాజిటివ్ కేసులు కాగా.. భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది.

కరోనా అప్‌డేట్స్: దేశంలో 3 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!
Follow us on

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఒక్కరోజులోనే 11,458 పాజిటివ్ కేసులు కాగా.. భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 ఉండగా.. 1,54,330 మంది డిశ్చార్జి అయ్యారు. 8,884 మంది మరణించగా.. 1,45,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 19నాటికి దేశంలో లక్ష కేసులు నమోదు కాగా, జూన్‌ 3నాటికి రెట్టింపు అయ్యాయి. ఇక మరో పది రోజుల్లోనే ఆ కేసులు 3 లక్షలకు చేరడం గమనర్హం. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా రికవరీ రేటు భారత్‌లో ఎక్కువగా ఉండటం ఆనందించాల్సిన విషయం. రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే 1,01,141 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర తరువాత తమిళనాడు(40,698), ఢిల్లీ(36,824), గుజరాత్(22,527), ఉత్తరప్రదేశ్(12,616) రాష్ట్రాలు టాప్‌ 5లో నిలిచాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో  4484, ఏపీలో 5,636కు చేరింది.

Read This Story Also: తమ్ముడి అరెస్ట్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు