ఈ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. ఎందుకంటే..!

కరోనాపై ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. వారు చేస్తోన్న పోరుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు

ఈ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. ఎందుకంటే..!

Edited By:

Updated on: Apr 19, 2020 | 7:26 PM

కరోనాపై ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. వారు చేస్తోన్న పోరుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు దేశవ్యాప్తంగా వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. ఆ క్రమంలో తెలంగాణకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ మరో అడుగు ముందుకేశారు. ఓ వైపు డ్యూటీ చేస్తూ.. మరోవైపు సమాజసేవ చేస్తున్నారు. పాత దుస్తులతో స్వయంగా మాస్క్‌లను తయారుచేస్తోన్న ఆ కానిస్టేబుల్‌.. వాటిని అవసరమైన వారికి ఇస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన అంబరేశ్వరి రాష్ట్ర గవర్నర్‌ సౌందర్‌ రాజన్‌ దగ్గర కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. రోజు మార్చి రోజు ఆమె విధులకు వెళ్తుండగా.. ఇంట్లో ఉన్న సమయంలో మాస్క్‌లను తయారుచేస్తున్నారు. ఇంట్లో ఉన్న పాత దుస్తులతో ఆమె ఈ మాస్క్‌లను కుడుతున్నారు. వాటిని తన ఇంటి చుట్టుపక్కల అవసరమైన వారికి అంబరేశ్వరి అందిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి తాను మూడు మాస్క్‌లను ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతూ.. అందరిలో అవగాహన కలిగిస్తున్నారు అంబరీశ్వరి. మార్కెట్‌లో ఒక్కో మాస్క్‌ ధర రూ.30 నుంచి రూ.50వరకు ఉంది.. దీని వలన చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. అందుకే నేనే మాస్క్‌లు తయారుచేసి అవసరమైన వారికి ఇవ్వాలనుకున్నా. ఇప్పటివరకు 7వేల మాస్క్‌లను తయారు చేశా. పది వేలు తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. కాటన్‌ దుస్తులతో నేను చేస్తోన్న ఈ మాస్క్‌ను ఉతికి వాడుకోవచ్చునని అంబరీశ్వరి తెలిపారు. కాగా అటు డ్యూటీలోనూ.. ఇటు ఇంటి దగ్గర సమాజసేవ చేస్తోన్న ఈ కానిస్టేబుల్‌కు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Read This Story Also: లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేదా..? రోడ్లపైకి వచ్చి నిరసనలు..!