కరోనాపై ‘ర్యాప్‌ సాంగ్‌’ విడుదల చేసిన సీపీ సజ్జనార్..!

| Edited By:

Apr 21, 2020 | 8:29 AM

కరోనాపై పోరులో భాగంగా అత్యవసర సిబ్బంది చేస్తోన్న సేవలపై ప్రముఖ గాయకుడు శ్రీరామచంద్ర ఓ ర్యాప్ సాంగ్ పాడారు. ఆ పాటను సైబరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసిస్తూ బాస్యశ్రీ ఈ పాటను రాయగా.. రాక్‌ షకీల్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ”కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇది స్ఫూర్తి అన్నారు. […]

కరోనాపై ర్యాప్‌ సాంగ్‌ విడుదల చేసిన సీపీ సజ్జనార్..!
Follow us on

కరోనాపై పోరులో భాగంగా అత్యవసర సిబ్బంది చేస్తోన్న సేవలపై ప్రముఖ గాయకుడు శ్రీరామచంద్ర ఓ ర్యాప్ సాంగ్ పాడారు. ఆ పాటను సైబరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసిస్తూ బాస్యశ్రీ ఈ పాటను రాయగా.. రాక్‌ షకీల్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ”కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇది స్ఫూర్తి అన్నారు. త‌మ‌ కోసం రాస్తున్న ఈ పాట త‌మ‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. ర్యాప్ సాంగ్ బయటకు వచ్చేందుకు ప్రోత్సహించి, సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. కరోనాపై పోరులో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారని.. వారి సేవలకు గుర్తింపుగా ఈ సాంగ్‌ను పాడానని తెలిపారు.

Read This Story Also: బ్రేకింగ్ న్యూస్‌: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో పాజిటివ్‌ కేసు, 500 మంది