Coronavirus:షాకింగ్.. రెండుసార్లు నెగిటివ్.. మూడోసారి పాజిటివ్‌.. అసలేం జరిగింది..!

| Edited By:

Mar 23, 2020 | 5:07 PM

దేశంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చాప కింద నీరులా భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్ ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలను తీసుకుంది. అంతేకాదు లోకల్ కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి.

Coronavirus:షాకింగ్.. రెండుసార్లు నెగిటివ్.. మూడోసారి పాజిటివ్‌.. అసలేం జరిగింది..!
Follow us on

దేశంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చాప కింద నీరులా భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్ ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలను తీసుకుంది. అంతేకాదు లోకల్ కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు ఈ నెల 31వరకు లాక్‌ డౌన్‌ను ప్రకటించాయి. ఇదిలా ఉంటే జమ్మకశ్మీర్‌లోని లెహ్‌ సరిహద్దు గ్రామంలో ఓ వ్యక్తికి రెండుసార్లు నెగిటివ్ రాగా.. తాజాగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో అతడితో పాటు కుటుంబసభ్యులను కూడా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వ్యక్తి ఉన్న ప్రాంతంలో ఆందోళన మొదలైంది.

అయితే క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి మామ ఇటీవల ఇరాన్ నుంచి రాగా ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ కుటుంబానికి కూడా పరీక్షలు నిర్వహించారు. అప్పుడు వారందరికీ నెగిటివ్‌గా తేలింది. కానీ డ్రైవర్ పరిస్థితిపై కాస్త అనుమానం వ్యక్తం చేసిన డాక్టర్లు.. లడఖ్ హార్ట్ ఫౌండేషన్‌లో అతడిని దిగ్బంధించారు. మిగిలిన కుటుంసభ్యులను ఇంటికి పంపారు. ఇక నాలుగు రోజుల క్రితం అతడి శాంపిల్స్‌ను మరోసారి పరీక్షల నిమిత్తం పంపగా.. నెగిటివ్‌ వచ్చింది. దీంతో డాక్టర్లు ఆ డ్రైవర్‌ను ఇంటికి పంపారు. ఈ క్రమంలో అతడి గ్రామస్తులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆ డ్రైవర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా.. పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు డ్రైవర్ కుటుంబాన్ని కూడా మరోసారి ఆసుపత్రికి తరలించారు. దీనిపై లడఖ్ అధికారులు మాట్లాడుతూ.. అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలనే ఇలాంటి తప్పిదం జరిగిందని అన్నారు. ఇదిలా ఉంటే అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

Read This Story Also: చిరు మూవీపై స్పందించిన కాజల్.. ఏమన్నారంటే..!