ఉమ్మడి నిజామాబాద్‌ను వణికిస్తోన్న కరోనా మహమ్మారి

| Edited By:

Jul 24, 2020 | 9:27 AM

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా కేసులు..

ఉమ్మడి నిజామాబాద్‌ను వణికిస్తోన్న కరోనా మహమ్మారి
Follow us on

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యేవి. అయితే గత పది రోజులుగా జిల్లాల్లో కూడా అత్యధికంగా నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో593 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. కామారెడ్డిలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోన బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిజామాబాద్‌లో కరోనా బారినపడి 30 మంది మరణించారు. కామారెడ్డిలో 11 మంది మరణించారు. ఇక జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు.. కోవిడ్ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారిని కూడా కరోనా వదలడం లేదు.

నిజామాబాద్‌లో 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు 13 మంది వైద్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నమోదైంది. మరో 9 మంది అధికారులకు కూడా సోకింది. ఇక తాజాగా నిజామాబాద్ మేయర్ దంపతులకు కూడా కరోనా పాజిటివ్‌ సోకింది. ఇక బాజిరెడ్డి బంధువు సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు గురువారం నాడు కరోనా బారినపడి మరణించారు.

ఇక కామారెడ్డిలో కూడా ప్రజాప్రతినిధులతో పాటు.. కోవిడ్ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులకు కరోనా వదలడం లేదు. ఇప్పటికే జిల్లాలో 35 మందికి పైగా పోలీసులు, పలువురు జర్నలిస్టులు, పది మందికి పైగా అధికారులు కరోనా బారినపడ్డారు.