ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తొలిసారిగా..

| Edited By:

Apr 21, 2020 | 3:50 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్నసంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటలీలోని గజగజ వణికిస్తోంది. తొలుత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే.. ఇక్కడే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది.అయితే అమెరికాలో కూడా కరోనా వ్యాప్తి చెందడంతో.. అమెరికా ఇటలీని దాటేసింది. ఇటలీలో రోజు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతన్నారు. అయితే ఈ సమయంలో ఇటలీ ప్రజలకి సోమవారం కాస్త ఊపిరి తీసుకునే […]

ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తొలిసారిగా..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్నసంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటలీలోని గజగజ వణికిస్తోంది. తొలుత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే.. ఇక్కడే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది.అయితే అమెరికాలో కూడా కరోనా వ్యాప్తి చెందడంతో.. అమెరికా ఇటలీని దాటేసింది. ఇటలీలో రోజు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతన్నారు. అయితే ఈ సమయంలో ఇటలీ ప్రజలకి సోమవారం కాస్త ఊపిరి తీసుకునే వార్త వారి చెవిన పడింది.

సోమవారం ప్రభుత్వం వెలువడించిన హెల్త్ బులిటెన్ లెక్కల ప్రకారం.. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య కాస్త తక్కువగా నమోదైందని తెలిపింది. ఫ్రెంచ్ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ వెల్లడించిన లెక్కల ప్రకారం 1,08,237 మంది కరోనా మహమ్మారితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ హెడ్ ఏంజెలో బోరెల్లి మాట్లాడుతూ.. తొలిసారిగా కరోనా విషయంలో సానుకూల సంకేతాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కరోనా బారినపడ్డ వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి 23,660 మంది ప్రాణాలు కోల్పోయారు.