కరోనా ఎఫెక్ట్.. సింహాచలం ఆలయాధికారుల కీలక నిర్ణయాలు..!!

| Edited By:

Mar 16, 2020 | 8:04 PM

కరోనా ఎఫెక్ట్‌తో సింహాచలం ఆలయాధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా.. అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దు చేసి.. కేవలం లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక సామూహిక సహస్రనామార్చనను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. మహానివేదన సమయాన్ని కూడా కుదించారు. భక్తులు 12 సంవత్సరాల లోపు.. 60 సంవత్సరాలు పైబడిన వారు మొక్కులు తీర్చుకునే ప్రక్రియ ఉంటే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. […]

కరోనా ఎఫెక్ట్.. సింహాచలం ఆలయాధికారుల కీలక నిర్ణయాలు..!!
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో సింహాచలం ఆలయాధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా.. అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దు చేసి.. కేవలం లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక సామూహిక సహస్రనామార్చనను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. మహానివేదన సమయాన్ని కూడా కుదించారు. భక్తులు 12 సంవత్సరాల లోపు.. 60 సంవత్సరాలు పైబడిన వారు మొక్కులు తీర్చుకునే ప్రక్రియ ఉంటే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇక ఉత్సవాలను కూడా ప్రత్యక్షంగా కాకుండా.. దేవస్థానం ప్రసారం చేసే లైవ్ టెలీకాస్ట్ ద్వారా వీక్షించాలంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు వినియోగించాలని సూచించారు.