కరోనా వైరస్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త…

|

Mar 29, 2020 | 11:13 AM

Coronavirus Effect: ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ముందస్తు చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారి గడువును ఏప్రిల్ 30వ తేది వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ […]

కరోనా వైరస్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త...
Follow us on

Coronavirus Effect: ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ముందస్తు చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారి గడువును ఏప్రిల్ 30వ తేది వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్‌ను మరింత పకడ్బందీగా చేసి.. ప్రజల్లో చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించాలని యోచిస్తోంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఏపీలో 19 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 67కు చేరింది.

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…