
దేశవ్యాప్త లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీయ విమానాల సర్వీసులను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇక ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్‌కు అనుమతి ఇవ్వగా.. బుక్ చేసుకున్న ప్రయాణీకులకు డబ్బులు రీఫండ్ ఇవ్వనున్నారు.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల ౩వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20 వరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం తప్పితే మినహా.. ఇళ్ల నుంచి బయటికి రాకూడదని తెలిపారు.
ఇవి చదవండి:
లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!
ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.
మందుబాబులకు ‘లిక్కర్ దానం’.. వీడియో వైరల్.. హైదరాబాద్ యువకుడి అరెస్ట్..
All domestic and international scheduled airlines operations shall remain suspended till11:59pm of 03 May 2020.
— DGCA (@DGCAIndia) April 14, 2020