ఇండియా.. కరోనా.. అదే జోరు.. పెరిగిన రీకవరీ రేటు

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 5:20 PM

దేశం సోమవారం మూడో దశ లాక్ డౌన్ లోకి ప్రవేశించింది. అదే సమయంలో పలు రాష్ట్రాలు మరిన్ని  సడలింపులు ప్రకటించాయి. మరోవైపు కరోనా కేసుల సంఖ్య 42,670 కి చేరుకోగా.. 1395 మంది రోగులు మరణించారు. 11,782 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,553 ఫ్రెష్ కేసులు నమోదు కాగా.. 72 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా-రికవరీ రేటు 27.52 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. […]

ఇండియా.. కరోనా.. అదే జోరు.. పెరిగిన రీకవరీ రేటు
Follow us on

దేశం సోమవారం మూడో దశ లాక్ డౌన్ లోకి ప్రవేశించింది. అదే సమయంలో పలు రాష్ట్రాలు మరిన్ని  సడలింపులు ప్రకటించాయి. మరోవైపు కరోనా కేసుల సంఖ్య 42,670 కి చేరుకోగా.. 1395 మంది రోగులు మరణించారు. 11,782 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,553 ఫ్రెష్ కేసులు నమోదు కాగా.. 72 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా-రికవరీ రేటు 27.52 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ముంబై విషయానికే వస్తే.. 441 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహారాష్ట్రలో 12,296 కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 521 కి చేరింది.

ఇలా ఉండగా.. వలస కూలీల నుంచి రైల్వే చార్జీలు వసూలు చేయడంలేదని, వారి తరలింపునకు అయ్యే వ్యయంలో 85 శాతం ఖర్చును కేంద్రం, మిగతా వ్యయాన్ని రాష్ట్రాలు భరిస్తాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. రాష్ట్రాల మధ్య రాకపోకలను ఇప్పుడే అనుమతించే ప్రసక్తి లేదన్నారు. చిన్న వ్యాపారులు  తమ వ్యాపారాలను ప్రారంభించుకోవచ్ఛునని, కానీ బడా మాల్స్, వాణిజ్య సముదాయాలు, థియేటర్లు మూసే ఉంటాయని ఆయన చెప్పారు.