
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011కి చేరింది. ఇందులో 18,659 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,28,484 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 14 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,868కు చేరుకుంది. ఇక నిన్న 2,140 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 91.54 సాంపిల్స్‌ను పరీక్షించారు….
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 70, చిత్తూరు 87, తూర్పుగోదావరి 139, గుంటూరు 206, కడప 47, కృష్ణా 153, కర్నూలు 27, నెల్లూరు 30, ప్రకాశం 37, శ్రీకాకుళం 24, విశాఖపట్నం 57, విజయనగరం 25, పశ్చిమ గోదావరి 154 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,441కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 808 మంది కరోనాతో మరణించారు.
Also Read:
‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..
రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..
#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?
బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..
#COVIDUpdates: 15/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,51,116 పాజిటివ్ కేసు లకు గాను
*8,25,589 మంది డిశ్చార్జ్ కాగా
*6,868 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,659#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0f78YJ1s4F— ArogyaAndhra (@ArogyaAndhra) November 15, 2020