Telangana Corona Updates: కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. అంతటా నిత్యం వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిన్న నమోదైన కేసులతో పోల్చుకుంటే.. కేసుల తీవ్రత కొంతమేర తగ్గింది. సోమవారం రాష్ట్రంలో 3,052 కేసులు నమోదు కాగా.. గత 24 గంటల్లో (మంగళవారం) తెలంగాణలో కొత్తగా 2,157 పాజిటివ్ కేసులు నిర్థారణయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 8 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. కరోనా కేసుల సంఖ్య 3,34,738 కి పెరగగా.. మరణాల సంఖ్య 821కి చేరింది.
కాగా.. నిన్న కరోనా నుంచి 821 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 3,07,499 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా.. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 361 కేసులు నిర్థారణయ్యాయి. తెలంగాణలో నిన్న 72,364 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,12,53,374 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.86 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం వేలాది మందికి కరోనా వ్యాక్సినేషన్‌ను ఇస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 20,10,611 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: