మహారాష్ట్రలో విళయ తాండవం చేస్తోన్న కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో విళయ తాండవం చేస్తోంది. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రకి చెందినవే. అంతేకాదు.. మరణాలు కూడా మహారాష్ట్రకు చెందినవే. తాజాగా.. గడిచిన 36 గంటల్లో రాష్ట్రంలో 835 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం ఉద్దవ్ థాక్రే తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లిమిటెడ్‌గా ఇండస్ట్రియల్‌ పనులకు పర్మిషన్ ఇచ్చామని.. అయినంత మాత్రన కరోనా తగ్గినట్లు కాదని.. ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించుకునేందుకు లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు చేస్తున్నట్లు […]

మహారాష్ట్రలో విళయ తాండవం చేస్తోన్న కరోనా..

Edited By:

Updated on: Apr 20, 2020 | 8:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో విళయ తాండవం చేస్తోంది. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రకి చెందినవే. అంతేకాదు.. మరణాలు కూడా మహారాష్ట్రకు చెందినవే. తాజాగా.. గడిచిన 36 గంటల్లో రాష్ట్రంలో 835 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం ఉద్దవ్ థాక్రే తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో
లిమిటెడ్‌గా ఇండస్ట్రియల్‌ పనులకు పర్మిషన్ ఇచ్చామని.. అయినంత మాత్రన కరోనా తగ్గినట్లు కాదని.. ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించుకునేందుకు లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా వైరస్ కేసులు నమోదు కాని.. హాట్‌స్పాట్‌ కానీ ప్రాంతాల్లో మాత్రమే ఇండస్ట్రియల్ పనులకు అనుమతించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగ ముంబై, పూణె నగరాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.