స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

| Edited By:

Apr 14, 2020 | 9:49 AM

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీని ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షా 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా మహమ్మారి గురించి డబ్ల్యూహెచ్‌వో షాకింగ్..

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం
Follow us on

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీని ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షా 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా మహమ్మారి గురించి డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 2009లో ప్రపంచాన్ని కుదిపేసిన స్వైన్‌ ఫ్లూ కంటే ఇది పది రెట్లు ప్రమాదకరమని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్.. స్వైన్‌ ఫ్లూ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ కనుగొనడంతోనే దీనికి అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడింది.

కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందని, 11 ఏళ్ల క్రిందట ప్రపంచాన్ని వణికించిన హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) కంటే కరోనా చాలా శక్తివంతమైనదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ తెలిపారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన కరోనా పేషెంట్లలో కూడా మళ్లీ నెగిటివ్ రావడం వైద్యులనే విస్మయానికి గురిచేస్తుందని.. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీనికి వ్యాక్సిన్‌ కనిపెట్టేంత వరకూ అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

కాగా వైరస్ తీవ్రత తగ్గిన క్రమంలో లాక్‌డౌన్ ఎత్తివేసే వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని టెట్రోస్ చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా మళ్లీ తిరిగి రాకపోకలు ప్రారంభమైతే.. కరోనా ముప్పు మళ్లీ తలెత్తే ప్రమాదం లేకపోలేదన్నారు. కాగా ఇప్పటివరకూ మనదేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 350 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి:

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?