Covid-19: ఏపీలో ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్‌.. హెల్త్‌ సెంటర్లతో పాటు స్కూళ్లు, కాలేజీల్లో కరోనా టీకాలు

|

Aug 31, 2021 | 1:30 PM

ఏపీ వ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వాళ్లందరికి టీకా ఇస్తున్నారు. హెల్త్‌ సెంటర్లతో పాటు స్కూళ్లు, కాలేజీల్లో

Covid-19: ఏపీలో ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్‌.. హెల్త్‌ సెంటర్లతో పాటు స్కూళ్లు, కాలేజీల్లో కరోనా టీకాలు
Covid Vaccine
Follow us on

Covid-19: ఏపీ వ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వాళ్లందరికి టీకా ఇస్తున్నారు. హెల్త్‌ సెంటర్లతో పాటు స్కూళ్లు, కాలేజీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 2,500 సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఇప్పటిదాకా 2కోట్ల 9 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఖ్య మరింత పెంచాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ పటమట స్కూల్‌ రోడ్డులో టీకా డ్రైవ్‌ జోరుగా సాగుతోంది. పడమట 45 వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, జిల్లా వైద్య శాఖాధికారిణి డాక్టర్ సుహాసిని తదితరులు పరిశీలించారు.

అటు, చిత్తూరులో కూడా టీకా డ్రైవ్ ఉధృతంగా కొనసాగుతోంది. లక్షా 20వేల డోసులు టార్గెట్‌గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది జిల్లా అధికార యంత్రాంగం. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌కి మంచి స్పందన లభిస్తోందని అధికారులు టీవీ9కు చెబుతున్నారు.స్పెషల్ డ్రైవ్‌పై వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ముందుగానే ప్రజలకి సమాచారమిచ్చి టైం స్లాట్ కేటాయించారు.

థర్డ్‌ వేవ్ ముప్పుని దృష్డిలో ఉంచుకుని ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, మెడికల్, ఐదేళ్ల చిన్నారుల తల్లులు, గర్భిణులకు ఇప్పటికే నూరుశాతం వ్యాక్సిన్ వేసేందుకు కృషి చేస్తున్నారు.

Read also:  Bapu: తెలుగువారి సంస్కృతిలో భాగమయిన బాపు బొమ్మలు.. నేడు బహుముఖ ప్రజ్ఙాశీలుని వర్థంతి.. ఫొటో గ్యాలరీ