సచివాలయంలో కరోనా కలకలం…సికింద్రాబాద్ నుంచి బస్సులో ప్రయాణించిన ఉద్యోగికి పాజిటివ్

సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణకావటంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మహమ్మారి కరోనా ఏ రూపంలో ఎటాక్ చేస్తుందోననే భయంతో అధికారులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.

సచివాలయంలో కరోనా కలకలం...సికింద్రాబాద్ నుంచి బస్సులో ప్రయాణించిన ఉద్యోగికి పాజిటివ్

Updated on: May 30, 2020 | 1:04 PM

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణకావటంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మహమ్మారి కరోనా ఏ రూపంలో ఎటాక్ చేస్తుందోననే భయంతో అధికారులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఏపీకి వచ్చిన సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారు, అతడితో పాటుగా సికింద్రాబాద్ నుంచి బస్సులో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు కోరారు. మంగళగిరి మండలం నవులూరు గోలివారితోటలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ కావడంతో అతడిని మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ విభాగంలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.