ఆ గ్రామంలో అతని ద్వారా 54 మందికి కరోనా

|

Aug 26, 2020 | 3:09 PM

లాక్ డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి వేగం పెంచుకుంది. ఇక, ప్రజలతో మమేకం అయ్యేవారిని నుంచి ఎక్కువగా కరోనా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో పింఛన్లు అందజేసిన వ్యక్తి ద్వారా గ్రామంలో 54 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు

ఆ గ్రామంలో అతని ద్వారా 54 మందికి కరోనా
Follow us on

కరోనా వైరస్ ప్రకోపానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి వేగం పెంచుకుంది. ఇక, ప్రజలతో మమేకం అయ్యేవారిని నుంచి ఎక్కువగా కరోనా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో పింఛన్లు అందజేసిన వ్యక్తి ద్వారా గ్రామంలో 54 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నంబావి మండలం పెద్దదగడలో పింఛన్లు అందజేసే ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు.దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే, అంతకు ముందు అతని ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పింఛన్లు పంపిణీ చేశాడు. ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరు నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కుటుంబంలోని 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలోని 250 మందికి ర్యాపిడ్‌, యాంటిజెన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో పాజిటివ్‌ వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారుల వెల్లడించారు.