కన్నుమూసిన ఎమ్మెల్యే కుటుంబంలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతుంది. తాజాగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, ఆయన కుమారుడు సతీష్ రెడ్డితో పాటు మనవడు, మనవరాలు కూడా కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం నాడు దుబ్బాక సీహెచ్‌సీలో 25 మందికి కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో నలుగురుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ నలుగురూ రామలింగారెడ్డి కుటుంబానికే […]

కన్నుమూసిన ఎమ్మెల్యే కుటుంబంలో కరోనా కలకలం

Edited By:

Updated on: Aug 18, 2020 | 7:49 PM

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతుంది. తాజాగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, ఆయన కుమారుడు సతీష్ రెడ్డితో పాటు మనవడు, మనవరాలు కూడా కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం నాడు దుబ్బాక సీహెచ్‌సీలో 25 మందికి కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో నలుగురుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ నలుగురూ రామలింగారెడ్డి కుటుంబానికే చేందిన వారు కావడంతో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల రామలింగారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక ఆయన 11వ రోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనగా.. తాజాగా రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రామలింగారెడ్డి ఇంటికి వెళ్లిన నేతలందరూ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుందని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.

Also Read:

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు