గుంటూరులో కరోనా టెర్రర్.. పరుగులు పెట్టిన అధికారులు

|

Jul 03, 2020 | 6:51 PM

కలెక్టర్‌ కార్యాలయం సమావేశానికి వచ్చిన ఆ ప్రజాప్రతినిధికి పాజిటివ్‌ వచ్చిందని సమాచారం రావడంతో... అక్కడి నుంచి అధికారులంతా బయటకు పరుగులు తీశారు...

గుంటూరులో కరోనా టెర్రర్.. పరుగులు పెట్టిన అధికారులు
Follow us on

Corona Positive : గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎప్పుడు ఎవరికి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా… కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వచ్చన ఓ ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారాలు ఆందోళనకు గురయ్యారు.

కలెక్టర్‌ కార్యాలయం సమావేశానికి వచ్చిన ఆ ప్రజాప్రతినిధికి పాజిటివ్‌ వచ్చిందని సమాచారం రావడంతో… అక్కడి నుంచి అధికారులంతా బయటకు పరుగులు తీశారు. తర్వాత సమావేశం జరిగిన హాల్‌ను అధికారులు శానిటైజ్‌ చేశారు. ప్రజాప్రతినిధితో సన్నిహితంగా ఉన్న నేతలు, అధికారులు ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.