
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ అదృశ్యమైంది. బుధవారం కరోనాతో మెహిదీపట్నంకి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే అతడి మృతదేహం కోసం వచ్చిన బంధువులకు డెడ్‌బాడీ కనిపించలేదు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి ఈ నెల 8న లంగ్ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్ట్ చేయగా.. కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ అయింది. అయితే అంతలోనే నిన్న ఉదయం 4 గంటలకు రషీద్ మరణించాడు. ఈ విషయాన్ని బుధవారం ఉదయమే రషీద్ బంధువులకు వైద్యులు తెలిపారు.
అయితే మృతదేహం కోసం నిన్న సాయంత్రం బంధువులు ఆస్పత్రి రాగా మార్చురీలో శవం కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే డెడ్‌బాడీ మాయంపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహం మిస్ అవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డెడ్ బాడీ కనిపించకుండా పోయిన ఘటన గాంధీ ఆస్పత్రి వద్ద కొంత ఆందోళనకు దారి తీసింది. కాగా మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More: ఆ రాష్ట్రంలో వేయ్యికి పైగా ప్రాంతాల పేర్లు మార్పు… కారణమిదే!