32 మంది పదో తరగతి విద్యార్థులకు కరోనా

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18వేలను దాటేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. శుక్రవారం నగరంలో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్ సోకడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వారి కాంటాక్ట్‌లను […]

32 మంది పదో తరగతి విద్యార్థులకు కరోనా

Edited By:

Updated on: Jul 04, 2020 | 4:33 PM

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18వేలను దాటేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. శుక్రవారం నగరంలో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్ సోకడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వారి కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. అయితే కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలతో పాటు పలు పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటకలో మాత్రం పరీక్షలను నిర్వహించారు. జూన్‌ 25 నుంచి జూలై 3 వరకు అక్కడ పరీక్షలు జరిగాయి. మొత్తం 7,61,506 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.