ఇండియాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 30 వేల కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 937 కి పెరిగింది. గత 24 గంటల్లో 1594 కేసులు నమోదు కాగా.. దాదాపు 64 మంది కరోనా రోగులు మృతి చెందారు. 21,632 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఈ 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదు. గత 28 రోజుల్లో 16 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదని ఈ శాఖ పేర్కొంది. కాగా.. లాక్ డౌన్ కారణంగా రికవరీ రేటు కూడా పెరుగుతోందని తెలుస్తోంది.