ఇస్రోలో కరోనా కలకలం..వెంటాడుతోన్న కోయంబేడు లింకులు

|

May 18, 2020 | 3:55 PM

నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని సూళ్లూరుపేటలో కోయంబేడు లింకులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

ఇస్రోలో కరోనా కలకలం..వెంటాడుతోన్న కోయంబేడు లింకులు
Follow us on

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రం కోయంబేడులో బయటపడ్డ కరోనా కేసుల లింకులు..ఏపీకి పాకుతున్నాయి. కోయంబేడు ఘటనతో అటు తమిళనాడు, ఇటు ఆంధప్రదేశ్‌ రాష్టాల్లో కరోనా కేసులు అమాంతంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లో కూడా కరోనా కలకలం రేగింది.

నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని సూళ్లూరుపేటలో కోయంబేడు లింక్ లు ఎక్కువగా బయటపడుతున్నాయి. తమిళనాడుకు చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 39 కి చేరుకుంది. ఇప్పుడు కోయంబేడు సెగలు ఇస్రోను వణికిస్తున్నాయి. కోవిడ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయే వరకు తాము జనరల్‌ డ్యూటీలు చేయలేమని షార్‌ ఉద్యోగులు అధికారులకు ఖరాఖండిగా చెబుతుండడం గమనార్హం. కొందరు ఉద్యోగులైతే ఇదే క్రమంలో సంస్థ రెండవ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్‌ను ఆవెూదించినట్లు సమాచారం.