ఎపి హైకోర్టుపై కరోనా ఎఫెక్ట్… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎపి హైకోర్టులో పలువురికి కరోనా సోకిన నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు. వాటిని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో విచార‌ణ చేయనున్నారు. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ విధానంలో కేసుల విచారణ‌ చేస్తారు. సీజే అనుమతించిన కేసులు మాత్రమే విచారణకు తీసుకుంటారు. అత్యవసర కేసులు మాత్రమే విచారిచనున్నారు. న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిష‌న్లు సైతం […]

ఎపి హైకోర్టుపై కరోనా ఎఫెక్ట్... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ

Updated on: Jul 02, 2020 | 6:38 AM

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎపి హైకోర్టులో పలువురికి కరోనా సోకిన నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు. వాటిని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో విచార‌ణ చేయనున్నారు. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ విధానంలో కేసుల విచారణ‌ చేస్తారు.

సీజే అనుమతించిన కేసులు మాత్రమే విచారణకు తీసుకుంటారు. అత్యవసర కేసులు మాత్రమే విచారిచనున్నారు. న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిష‌న్లు సైతం ఈ-ఫైలింగ్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెయిల్‌లో అటాచ్‌మెంట్లు స్వీక‌రించ‌బోమ‌ని తెలిపారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.