Corona Cases: కరోనా హడలెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా వెలువడ్డ తాజా బులిటెన్‌లో40 వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 10,57,383 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..39,726 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చితే 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.
కరోనా..మూడు అక్షరాలు కాని..మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది..ఆ మూడు ఆక్షరాలకే దేశమే కాదు ఏకంగా ప్రపంచమే వణికిపోతోంది.. ఇప్పుడు అదే భయం కేంద్రానికి పట్టుకుంది..సెకండ్ వేవ్ విజృభిస్తోన్న సంకేతాలతో అప్రమతమైన కేంద్రం..రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది..
మహారాష్ట్రలో కోవిడ్ వైరస్ మరోమారు తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ కేసులతో అగ్ర స్థానంలో ఉండగా తాజాగా నమోదైన కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 25,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. 2021 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గురువారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 218 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని వైద్య శాఖ వెల్లడించింది. ఇక, ఇవాళ కొత్తగా 117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,740 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,759కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 7,186 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ.
కాగా, కరోనా నిబంధనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని తప్పక అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది.
భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది.
కరోనాతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు విజృంభిస్తున్న సెలవుల్లో ఉన్నటువంటి వైద్యులు, హెల్త్ వర్కర్లు వెంటనే డ్యూటీలో చేరాలని ఆదేశించారు. గత 24 గంటల్లో కొత్తగా 107 కోవిడ్ -19 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Bihar Government cancels leaves of all doctors and healthcare workers, paramedical staff till 5th April, in view of the COVID19 situation
— ANI (@ANI) March 19, 2021
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 313 కొత్త కరోనా కేసుల సంఖ్య నమోదు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,02,360కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,664కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 313 మంది వైరస్ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,02,360కు చేరింది. రాష్ట్రంలో గురువారం 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాలం చేసిన గాయాన్ని మర్చిపోయి..అంతా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చామో లేదో..మళ్లీ పంజా విసురుతోంది కరోనా వైరస్. మహమ్మారి దెబ్బకు విలవిల్లాడిపోయిన తెలంగాణలో మళ్లీ క్రమంగా కేసులు పెరగడం ఒకింత భయాందోళనలు కలిగిస్తోంది. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మజ్యోతిరావుపూలే బాయ్స్ గురుకుల పాఠశాలలో కేవలం రోజు వ్యవధిలో 34మంది మహమ్మారి బారినపడ్డారు.