రేపటితో ముగియనున్న లాక్ డౌన్ 3.0..ఎల్లుండి నుంచి ఇలా..

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న‌మూడో విడత లాక్‌డౌన్ రేప‌టితో (ఆదివారంతో) ముగియనుంది  కాగా, నాలుగో విడత లాక్‌డౌన్ అమ‌లుకు కేంద్రం సమాయత్తమ‌వుతోంది.. నాలుగో విడత లాక్‌డౌన్‌లో  మరిన్ని సడలింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలను పునరుద్ధరించే అవకాశం ఉంది. జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఇక హాట్ స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ […]

రేపటితో ముగియనున్న లాక్ డౌన్ 3.0..ఎల్లుండి నుంచి ఇలా..

Updated on: May 16, 2020 | 12:02 PM

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న‌మూడో విడత లాక్‌డౌన్ రేప‌టితో (ఆదివారంతో) ముగియనుంది  కాగా, నాలుగో విడత లాక్‌డౌన్ అమ‌లుకు కేంద్రం సమాయత్తమ‌వుతోంది.. నాలుగో విడత లాక్‌డౌన్‌లో  మరిన్ని సడలింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలను పునరుద్ధరించే అవకాశం ఉంది. జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఇక హాట్ స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
మే 18 నుంచి లాక్‌డౌన్ 4.0 అమ‌ల్లోకి రానుంది. ఈ సారి లాక్‌డౌన్‌లో మ‌రిన్ని స‌డ‌లింపులు ల‌భించే అవ‌కాశం ఉంద‌నే స‌మాచారం అందుతోంది. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో అన్ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నుండ‌గా, రెడ్‌జోన్‌, కంటైన్మెంట్ జోన్ల‌లో ఆంక్ష‌లు క‌ఠినంగా ఉండ‌నున్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్ జోన్ల‌ను నిర్ధారించే అధికారం కూడా కేంద్రం రాష్ట్రాల‌కే అప్ప‌గించ‌నున్న‌ట్లు కేంద్ర వ‌ర్గాల స‌మాచారం. ఇక స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, థియేట‌ర్లు మూసివేత కొన‌సాగ‌నుండ‌గా, ప‌రిమితంగా  రైళ్లు, బ‌స్సులు, విమానాల‌ను న‌డిపే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.