
ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ సెంచరీ దాటాయి. గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు నాలుగు వేలకి పైగా దాటాయి. తాజాగా 182 కరోనా కేసులు నమోదైనట్టు.. ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రానికి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 38 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,261కి చేరింది. అలాగే ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో.. ఈ సంఖ్య 80కి చేరింది. ఇక కోవిడ్ నుంచి 2540 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1641 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
కాగా ఇక దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరోసారి అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 9,996 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 2,86,579కి చేరగా.. ఇందులో యాక్టివ్ కేసులు 137448 ఉన్నాయి. అటు 1,41,028 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 357 మంది మహమ్మారి బారిన పడి మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 8102కి చేరింది.