రోహిణి జైలుల్లో ఒక్కసారిగా కలవరం

|

May 14, 2020 | 4:40 PM

కరోనా మహమ్మారీ కారాగారంలోని ఖైదీలను సైతం వదలడంలేదు. ఇంతకాలం బయట తిరిగేవారిని అంటుకున్న కరోనా జైలులోని ఖైదీలను కబళిస్తోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి జైలులోని ఓ క్రిమిన‌ల్ ఖైదీకి క‌రోనా సోకింద‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన క‌రోనా బాధితుడికి హ‌త్యాయ‌త్నాం, దోపిడి లాంటి మూడు క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించి శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఆ త‌ర్వాత కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్షించ‌గా, […]

రోహిణి జైలుల్లో ఒక్కసారిగా కలవరం
Follow us on

కరోనా మహమ్మారీ కారాగారంలోని ఖైదీలను సైతం వదలడంలేదు. ఇంతకాలం బయట తిరిగేవారిని అంటుకున్న కరోనా జైలులోని ఖైదీలను కబళిస్తోంది.
తాజాగా ఢిల్లీలోని రోహిణి జైలులోని ఓ క్రిమిన‌ల్ ఖైదీకి క‌రోనా సోకింద‌ని అధికారులు తెలిపారు.
ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన క‌రోనా బాధితుడికి హ‌త్యాయ‌త్నాం, దోపిడి లాంటి మూడు క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించి శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఆ త‌ర్వాత కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్షించ‌గా, క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.
జైలులో ఉన్నప్పడు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌న్న జైలు అధికారులు.. అత‌నికి క‌రోనా ఎలా సోకింద‌నే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు.
ముందు జాగ్రత్త చ‌ర్య‌గా జైలులోని 20 మంది ఖైదీలు, ఐదుగురు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క్వారంటైన్‌లో ఉంచారు.
ఇప్పటికే ముంబై ఆర్థ‌ర్ రోడ్ జైలులోని ఖైదీలకు, సిబ్బందికి కోవిడ్ సోకింది. అటు ఢిల్లీ తీహార్ జైలులోనూ క‌రోనా కేసులు వెలుగుచూశాయి
తాజాగా మరో జైలులో కరోనా వెలుగుచూడడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.