దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక రోజుకీ ఎక్కడో ఓ చోట పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకుందనే భయంతో పలువురు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగింది.
కోవిడ్ సోకిందనే భయంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి గంగిరెడ్డి సూసైడ్ చేసుకున్నారు. యర్రగుంల్ల మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకడంతో గంగిరెడ్డి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం చెప్పకుండా వెళ్లిన గంగిరెడ్డి.. ఎర్రగుంట మండలం సున్నపురాళ్ల పల్లె దగ్గర రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కోవిడ్ సోకిందనే భయంతోనే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read More:
వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం
బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ