ఏపీలో మ‌రోసారి స‌మ‌గ్ర స‌ర్వే..ఎందుకంటే…

|

Mar 25, 2020 | 6:43 AM

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌రోసారి స‌మ‌గ్ర స‌ర్వే నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే, ఓ వైపు...

ఏపీలో మ‌రోసారి స‌మ‌గ్ర స‌ర్వే..ఎందుకంటే...
Follow us on

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌రోసారి స‌మ‌గ్ర స‌ర్వే నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే, ఓ వైపు దేశంలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. ప్ర‌ధాని దేశంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇప్పుడు స‌మ‌గ్ర స‌ర్వే ఏంట‌నే సందేహాలు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. అయితే, ఈ స‌ర్వే క‌రోనా క‌ట్ట‌డికేనంటున్నారు సీఎం జ‌గ‌న్‌.

రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. . ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారిని కలిసిన వారిపైనే కాకుండా ప్రజలందరిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంగళవారం రాత్రి తన నివాసంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు, కరోనా వైరస్ వ్యాప్తిపై ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..వైరస్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి మరోసారి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో సర్వే చేయించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని, కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వైద్య సహాయం అందించాలన్నారు.

సమగ్ర సర్వేతో కోవిడ్‌ 19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతామని సీఎం తెలిపారు. ఇంటికొక్కరు మాత్రమే నిత్యావసరాలకు బయటకు వచ్చేందుకు అనుమతి ఉందని, అదికూడా 3 కి.మీ పరిధి వరకేనని స్పష్టం చేశారు. ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందని, కాబట్టి అందరూ లాక్‌ డౌన్‌ను విధిగా పాటించాలని సీఎం జగన్ కోరారు. ఇంట్లో ఉండడం వల్ల వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారవుతారని సూచించారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.