‘చంపేస్తాం’…. చైనా రచయిత్రికి వార్నింగ్ కాల్స్ !

| Edited By: Pardhasaradhi Peri

Apr 22, 2020 | 6:29 PM

కరోనా వైరస్ రాకాసి కారణంగా చైనా లోని వూహాన్ సిటీని ప్రపంచంలోని ఇతర దేశాలతో దిగ్బంధం చేసిన అనంతరం ఓ రచయిత్రి రాసిన ఆన్ లైన్ డైరీ ఇప్పుడు పాపులర్ అయింది. 2010 లో చైనాలోని అత్యున్నత సాహితీ పురస్కారాన్ని అందుకున్న 64 ఏళ్ళ ఫాన్గ్ ఫాన్గ్ అనే ఈ రైటర్ని చంపేస్తామంటూ ఒకటే ఫోన్ కాల్స్ బెదిరింపులు వస్తున్నాయట. వూహాన్  సిటీ దాచిపెట్టిన రహస్యాలను ఈమె మెల్లగా ఇతర దేశాలకు చూపడానికి ప్రయత్నిస్తోంది. కరోనా ఎపిడమిక్ […]

చంపేస్తాం.... చైనా రచయిత్రికి వార్నింగ్ కాల్స్ !
Follow us on

కరోనా వైరస్ రాకాసి కారణంగా చైనా లోని వూహాన్ సిటీని ప్రపంచంలోని ఇతర దేశాలతో దిగ్బంధం చేసిన అనంతరం ఓ రచయిత్రి రాసిన ఆన్ లైన్ డైరీ ఇప్పుడు పాపులర్ అయింది. 2010 లో చైనాలోని అత్యున్నత సాహితీ పురస్కారాన్ని అందుకున్న 64 ఏళ్ళ ఫాన్గ్ ఫాన్గ్ అనే ఈ రైటర్ని చంపేస్తామంటూ ఒకటే ఫోన్ కాల్స్ బెదిరింపులు వస్తున్నాయట. వూహాన్  సిటీ దాచిపెట్టిన రహస్యాలను ఈమె మెల్లగా ఇతర దేశాలకు చూపడానికి ప్రయత్నిస్తోంది. కరోనా ఎపిడమిక్ ని తమ దేశం ఎలా హ్యాండిల్ చేసిందో తాను వివరిస్తానని ఈమె అంటోంది. ఇదే ఇప్పుడు చైనీయుల ఆగ్రహానికి కారణమవుతోంది. కరోనా వైరస్ ఫై వూహాన్ సిటీలోని ప్రజల భయాలు, కోపం, మళ్ళీ జీవితంపై ఆశలు.. ఇవన్నీ  జనవరి 23న  ఈ నగరానికి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలను, పూసగుచ్చ్చినట్టు ఈ రచయిత్రి తన డైరీలో వివరించింది. రోగులతో కిక్కిరిసిన ఆసుపత్రులు, వారిని విసుక్కుంటూ ఇళ్లకు తిప్పి పంపేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, మాస్కుల కొరత ఇలా అన్నింటినీ తన ‘రచనా వ్యాసంగం’ లో వివరించింది. కరోనా వైరస్ మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని, దీని ప్రమాదం గురించి తన సుపీరియర్లకు తెలియజేసినా వారు ప్రజలను గానీ, ప్రభుత్వాన్ని గానీ హెచ్చరించలేదని తన బంధువైన ఓ డాక్టర్ చెప్పిన విషయాన్ని కూడా ఈ రచయిత్రి ప్రస్తావించింది. అయితే కమ్యూనిస్టు దేశమైన చైనా .. తన సీక్రెట్లను ఇతరులకు తెలియజేయడానికి ఏమాత్రం ఇష్టపడదు గనుక.. ఈమెకు డెత్ త్రెట్లు ఎక్కువవుతున్నాయి.