చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..

|

Apr 24, 2020 | 12:11 PM

కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న చైనాకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తాజాగా అక్కడ కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న చైనాకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తాజాగా అక్కడ కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. న్యూయార్క్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన ఓ యువతి నుంచి కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందిందన్న అనుమానాలు తలెత్తడంతో హర్బిన్ సిటీ మొత్తాన్ని అక్కడి ప్రభుత్వం మూసేసింది.

సదరు యువతి ద్వారా సుమారు 78 మందికి కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. హర్బిన్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం హాన్ అనే యువతి మార్చి 19న న్యూయార్క్ నుంచి చైనా వచ్చినట్లు తెలుస్తోంది. రాగానే ఆమెను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారట. ఇక ఆ తర్వాత టెస్టులు చేయడంతో నెగటివ్ తేలింది. దీనితో అధికారులు ఆమెను పంపించేశారు. అయితే ఊహించని విధంగా హాన్ కలిసిన వారందరికీ వైరస్ సోకింది. మొదటిగా ఆమె నుంచి 87 ఏళ్ల వృద్దుడికి వ్యాధి సోకిందని.. అక్కడ నుంచి మిగతావారికి వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ప్రసుత్తం నగరం 52 యాక్టివ్ కేసులు ఉండగా.. ఎవరి పరిస్థితి సీరియస్‌గా లేదని అధికారులు చెబుతున్నారు. హర్బిన్ నగరం ప్రస్తుతం 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటుందని.. అక్కడి ప్రజలందరికీ కూడా టెస్టులు చేసి నెగటివ్ వచ్చాకే నిషేధం ఎత్తివేస్తామని అక్కడి స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..