
మనుషులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు చైనాకు చెందిన మరో కంపెనీ రెడీ అయ్యింది. దీంతో పాకిస్థాన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు తమ దేశానికి రావాలంటూ పాక్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చైనాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీని వెల్‌కమ్ చెప్పింది. తమ దేశంలోని మనుషులపై కరోనా వ్యాక్సిన్ పరీక్షలు చేయాలంటూ పాక్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ .. చైనా కంపెనీని ఆహ్వానించింది. అయితే పాక్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ టెస్టులు చేస్తే.. దాని ప్రభావం ఎలా ఉంటుంది..? వ్యాక్సిన్ వ్యాధిని నయం చేయగలదా..?… మానవులపై ప్రయోగిస్తే.. ఏమైనా ఇతర ప్రభావం చూపనుందా అన్నది పరీక్షించనున్నారు. అంతేకాదు.. ఈ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. ఇప్పుడు కాదని.. మరో మూడు నెలల తర్వాత స్టార్ట్ అవుతాయని పాక్ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా టీకాలపై టెస్టులు చేస్తున్నాయి. కానీ ఇంకా ఎక్కడ కూడా విజయవంతం కాలేదు. అయితే చైనా కంపెనీకి చెందిన క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే.. వ్యాక్సిన్‌ను కూడా త్వరగ పొందవచ్చని పాక్ ఆలోచిస్తోంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ మూడు స్టేజ్‌లలో చేస్తారు. తొలుత జంతువులపై ప్రయోగించి..ఆ తర్వాత మనుషులపై ప్రయోగిస్తారు.