‘మా టెస్ట్ కిట్స్ లోపభూయిష్టమైనవా ?’ ఇండియాపై చైనా ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Apr 28, 2020 | 3:35 PM

చైనా కంపెనీలు తయారు చేసిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్ ను వాడరాదంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా ఈ సమస్యను సహేతుకంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.

మా టెస్ట్ కిట్స్ లోపభూయిష్టమైనవా ? ఇండియాపై చైనా ఫైర్
Follow us on

చైనా కంపెనీలు తయారు చేసిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్ ను వాడరాదంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా ఈ సమస్యను సహేతుకంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఫాల్టీ (నాసిరకం) కిట్స్ ను అందజేసిన చైనాకు ఒక్క రూపాయి  కూడా ఇచ్ఛే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన ఆర్దర్లను రద్దు చేస్తున్నట్టు కూడా హెచ్చరించింది. అయితే ఈ కిట్స్ ని వాడరాదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తీసుకున్న నిర్ణయం తమను ఎంతో బాధిస్తోందని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రాంగ్ అన్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు, సరుకులపై తాము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు .

చైనాలోని గ్వాంగ్ జౌ వాండ్ ఫో బయోటెక్, జుహాయి లివ్ జాన్ డయాగ్నస్టిక్స్ అనే రెండు కంపెనీలు తయారు చేసిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్ లోపభూయిష్టంగా ఉన్నాయని, వీటి వాడకాన్ని నిలిపివేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అన్ని రాష్ట్రాలను కోరిన సంగతి తెలిసిందే. అయితే మా దేశ ఉత్పత్తులకు ఈ విధమైన ముద్ర వేయరాదని జీ రాంగ్ అభ్యర్థించారు. చైనా నుంచి సుమారు ఆరున్నర లక్షల కిట్స్ ఇటీవలే ఇండియాకు చేరాయి.