
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న కోవిడ్ వైరస్‌ని నివారించేందుకు ప్రపంచశాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడే కరోనా వ్యాక్సిన్ తయారీ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ ట్రయల్ పూర్తి చేసుకుని సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో చైనా మరో అడుగు ముందుకేసింది. చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ఇందులో ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు.
ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా బృందానికి పిఎల్‌ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.
ఇక, గత మార్చి నెలలో ఈ బృందం చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో టీకా సమర్థతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలాగే రెండవ దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నారనీ, ఇందులో ప్లేసిబో నియంత్రణ బృందం కూడా ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. ముఖ్యంగా, క్లినికల్ హ్యూమన్ టెస్టింగ్‌లో మొదటి దశగా వారు తెలిపారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు స్థానిక మీడియా జిన్హువా మంగళవారం నివేదించింది.