ఆందోళన అక్కర్లేదు.. పిల్లల్లో ఆ లక్షణం కరోనా కాదు

| Edited By:

Sep 19, 2020 | 11:15 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వచ్చినా కొంతమంది

ఆందోళన అక్కర్లేదు.. పిల్లల్లో ఆ లక్షణం కరోనా కాదు
Follow us on

Children Coronavirus Symptoms: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వచ్చినా కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు కీలక విషయం చెప్పారు. చిన్నపిల్లల్లో ముక్కు విప‌రీతంగా కారడాన్ని క‌రోనా వైర‌స్ లక్షణంగా భావించవద్దని సూచించారు. కరోనాతో వచ్చే జ‌లుబుకు ముక్కు కార‌దని, కానీ ముక్కు దిబ్బడేసిన‌ట్లుగా ఉంటుంద‌ని వారు తెలిపారు. సాధారణ జ‌లుబు చేస్తే ముక్కు కారడం ఓ మామూలు లక్షణమని.. దాన్ని కరోనా లక్షణంగా భావించకండని అన్నారు. అలాగే పిల్లల్లో ముక్కు కారడం ఉంటే, కచ్చితంగా కరోనా వైరస్ లేనట్లేనని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ ప్రొఫెస‌ర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు.

ఇక కరోనా మహమ్మారి లక్షణాలపై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముక్కు కారడంతో పాటు ఇతర లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి వలన వైద్య పరీక్షలు చేయడం సవాల్‌గా మారిందని.. ఇలాంటి పరిస్థితుల్లో జలుబు ఏదో, కరోనా లక్షణం ఏదో గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని టిమ్ వివరించారు.

Read More:

చంద్రబాబుకు షాక్‌.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై

మంత్రి ఈటెల ‘పేషీ’లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌