చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ… అందుకేనా…?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీ ఆధ్వర్యంలో తొలి విడత సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తాజాగా రెండో విడత సాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులను ఇస్తే… ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ […]

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ... అందుకేనా...?

Updated on: May 29, 2020 | 12:54 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీ ఆధ్వర్యంలో తొలి విడత సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తాజాగా రెండో విడత సాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులను ఇస్తే… ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌. శంకర్‌, సి.కళ్యాణ్‌, బెనర్జీ, దామోదర్‌తోపాటు మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులుపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.