తిరుపతి ఆలయాల్లో కరోనా కలకలం

|

Jun 12, 2020 | 1:23 PM

తిరుపతిలోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శ్రీ గోవింద‌రాజ‌ స్వామివారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో శుక్ర‌, శ‌నివారాల్లో ఆల‌యాన్ని మూసివేయ‌డం జ‌రుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసి.. అనంతరం తిరిగి ఆదివారం య‌థావిధిగా  తెరుస్తామన్నారు. ఆలయంలో పనిచేస్తున్న టిటిడి ఉద్యోగికి వేరువేరు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌డంతో రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లారని… ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ […]

తిరుపతి ఆలయాల్లో కరోనా కలకలం
Follow us on

తిరుపతిలోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శ్రీ గోవింద‌రాజ‌ స్వామివారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో శుక్ర‌, శ‌నివారాల్లో ఆల‌యాన్ని మూసివేయ‌డం జ‌రుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసి.. అనంతరం తిరిగి ఆదివారం య‌థావిధిగా  తెరుస్తామన్నారు.

ఆలయంలో పనిచేస్తున్న టిటిడి ఉద్యోగికి వేరువేరు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌డంతో రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లారని… ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఈ ఉద్యోగి సంచ‌రించిన పాత హుజుర్ ఆఫీస్‌, పిహెచ్ స్టోర్‌ను కూడా రెండు రోజుల పాటు మూసివేసి శానిటరైజేషన్ చేసిన తర్వాతే తెరుస్తామని ప్రకటించారు. అదేవిధంగా, ఉద్యోగికి సన్నిహితంగా ఉన్న వ్య‌క్తులంద‌రినీ గుర్తించి.. కొవిడ్-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌‌డం జరుగుతుందని తెలిపారు.