నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. వీటిపైనే చర్చ

| Edited By:

May 20, 2020 | 7:40 AM

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. లాక్‌ డౌన్‌ 4.0 పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, ఉమ్‌ఫున్‌ తుఫాన్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు లాక్‌డౌన్ 4.0ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం…ఆంక్షల సడలింపులను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం… దేశంలోని అనేక రంగాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంది. వలస […]

నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. వీటిపైనే చర్చ
Follow us on

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. లాక్‌ డౌన్‌ 4.0 పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, ఉమ్‌ఫున్‌ తుఫాన్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు లాక్‌డౌన్ 4.0ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం…ఆంక్షల సడలింపులను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం… దేశంలోని అనేక రంగాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంది.

వలస కూలీలు, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు కీలకమైన సంస్కరణలు తీసుకుంది. ఐతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్‌పై కూడా కేంద్ర కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది.