బీఎస్ఎఫ్ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా పాజిటివ్.. 40 మంది సిబ్బంది క్వారంటైన్..

| Edited By:

May 31, 2020 | 7:19 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా,పెద్ద, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందర్నీ తాకుతోంది. తాజాగా భారత భద్రతా బలగాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వెస్ట్‌బెంగాల్‌లో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా సోకింది. సిలిగురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది.. నార్త్ బెంగాల్‌ ఫ్రంటైర్‌ కడమట్లలో విధులు నిర్వహస్తున్నారు. అంతేకాదు.. ఇతను లాజిస్టిక్స్‌, అకామిడేషన్‌కి చెందిన విభాగాల్లో ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇతడిని ఆస్పత్రిలో […]

బీఎస్ఎఫ్ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా పాజిటివ్.. 40 మంది సిబ్బంది క్వారంటైన్..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా,పెద్ద, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందర్నీ తాకుతోంది. తాజాగా భారత భద్రతా బలగాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వెస్ట్‌బెంగాల్‌లో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా సోకింది. సిలిగురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది.. నార్త్ బెంగాల్‌ ఫ్రంటైర్‌ కడమట్లలో విధులు నిర్వహస్తున్నారు. అంతేకాదు.. ఇతను లాజిస్టిక్స్‌, అకామిడేషన్‌కి చెందిన విభాగాల్లో ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇతడిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇతడికి సంబంధించిన కాంటాక్ట్‌ అయిన 40 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించారు.

ఇదిలావుంటే.. వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్రంలో శనివారం నాడు తాజాగా మరో 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,130కి చేరిందని వెస్ట్ బెంగాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.