బ్రేవో ముకేష్ .. ఆ డీల్ పై ఆనంద్ మహీంద్రా హర్షం

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి పెట్టడం పట్ల పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. కరోనా క్రైసిస్ అనంతరం ఇది (డీల్) భారత ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవానికి మంచి సంకేతమని ఆయన అన్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు,కో-ఫౌండర్ మార్క్ జుకర్ బెర్గ్ నుంచి ఈ డీల్ ని పొందినందుకు ఆయన ముకేష్ అంబానీని అభినందించారు. ఈ ఒప్పందం కేవలం ఈ రెండు సంస్థలకే కాదని, కరోనా సంక్షోభం […]

బ్రేవో ముకేష్ .. ఆ డీల్ పై ఆనంద్ మహీంద్రా హర్షం

Edited By:

Updated on: Apr 22, 2020 | 5:34 PM

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి పెట్టడం పట్ల పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. కరోనా క్రైసిస్ అనంతరం ఇది (డీల్) భారత ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవానికి మంచి సంకేతమని ఆయన అన్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు,కో-ఫౌండర్ మార్క్ జుకర్ బెర్గ్ నుంచి ఈ డీల్ ని పొందినందుకు ఆయన ముకేష్ అంబానీని అభినందించారు. ఈ ఒప్పందం కేవలం ఈ రెండు సంస్థలకే కాదని, కరోనా సంక్షోభం తరువాత భారత ఎకానమీకి మంచి ఊతమవుతుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇండియాను ఓ నూతన వృద్ది కేంద్రంగా ప్రపంచానికి చూపడానికి ఇది మంచి  అవకాశమన్నారు. జియో ప్లాట్ ఫామ్స్ లో ఫేస్ బుక్ 9. 99 శాతం వాటాకి డీల్ కుదుర్చుకుని.. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థకు చేయూతనిచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us