UK COVID-19 : ఆ దేశంలో ఆగని కరోనా కల్లోలం.. మార్చి 8 వరకూ స్కూల్స్ బంద్ .. విద్యార్థులకు రోజూ ఆహార ప్యాకెట్లు పంపిణీ

|

Jan 28, 2021 | 1:52 PM

రోనా వైరస్ యూరోపియన్ కంట్రీల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. బ్రిటన్  లో కరోనా వైరస్ రూపు మార్చుకుని స్టైయిట్ గా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంగ్లాండ్ లో కరోనా వైరస్..

UK COVID-19 : ఆ దేశంలో ఆగని కరోనా కల్లోలం.. మార్చి 8 వరకూ స్కూల్స్ బంద్ .. విద్యార్థులకు రోజూ ఆహార ప్యాకెట్లు పంపిణీ
Follow us on

UK COVID-19 : కరోనా వైరస్ యూరోపియన్ కంట్రీల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. బ్రిటన్  లో కరోనా వైరస్ రూపు మార్చుకుని స్టైయిట్ గా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంగ్లాండ్ లో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గక పోవడంతో.. మార్చి 8 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి మళ్ళీ నిర్ణయాన్ని పున: సమీక్షిస్తామని తెలిపారు. పాఠశాలలు మళ్ళీ తెరచుకుని వరకూ అర్హులైన విద్యార్థులకు ఫుడ్‌ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాలు ఇస్తున్నామని.. పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామని .. అప్పుడే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Also Read: బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం.. ఇక్కడ శివుడిని పూజించిన భక్తుల కష్టాలు మాయం