రచయితగా మారిన సోనూ.. వలసకూలీలపై ‘బుక్’

| Edited By:

Jul 15, 2020 | 5:02 PM

వారితో ప్రయాణం చేస్తుండగానే.. నాకు వారిపై ఓ బుక్ రాయాలనిపించింది. అందుకే వెంటనే బుక్ రాయడం మొదలు పెట్టా. ఆ బుక్‌కి 'లైఫ్ ఛేంజింగ్' అనే పేరు పెట్టాను. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా.. ఈ పుస్తకాన్ని ప్రచురించనుందని..

రచయితగా మారిన సోనూ.. వలసకూలీలపై బుక్
Follow us on

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ రచయితగా మారబోతున్నారు. కోవిడ్ మహమ్మారి లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ రియల్ హీరోగా మారిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచాడు. ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేసి వారిని వారి స్వస్థలాలకు చేర్చాడు. దీంతో పాటు పంజాబ్‌లోని ఓ వైద్య బృందానికి పీపీఈ కిట్లను విరాళం ఇచ్చారు సోనూ.

ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. వారితో ప్రయాణం చేస్తుండగానే.. నాకు వారిపై ఓ బుక్ రాయాలనిపించింది. అందుకే వెంటనే బుక్ రాయడం మొదలు పెట్టా. ఆ బుక్‌కి ‘లైఫ్ ఛేంజింగ్’ అనే పేరు పెట్టాను. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా.. ఈ పుస్తకాన్ని ప్రచురించనుందని వెల్లడించారు సోనూ. ఈ మేరకు సోనూ సూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ట్వీట్ చేశారు.

‘గత మూడున్నర నెలలుగా వలస కార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడుపుతూ, వారి బాధలను పంచుకున్నా. ఈ క్రమంలో నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. వారి ముఖాల మీద చిరు నవ్వు, ఆనందబాష్పాలు నా జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చాయి. ఈ ప్రయాణంలో వారితో ఏర్పడిన బంధం ఓ అందమైన బంధాన్నే ఓ పుస్తకంగా రాస్తున్నాను. చిట్టచివరి వలస కూలీ తన స్వగ్రామానికి చేరే వరకూ ఈ కార్యక్రమాన్ని ఆపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను నని ఇన్‌స్టాలో పేర్కొన్నారు’ సోనూ.

Read More:

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..