బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన అభిషేక్.. స్టార్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. కానీ ఎక్కువ కాలం బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు తన మార్కెట్‌ని నిలుపుకోలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే.. ఇటలీవలే అభిషేక్ బచ్చన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య తాను కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశానని.. దానికి కారణం తన గారాల పట్టి ఆరాధ్య అని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టిన అభిషేక్.. నెక్ట్స్ బ్రీత్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో గతంలో తాను రిజెక్ట్ చేసిన సినిమాల విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు.
‘అడల్ట్ సీన్స్’, ‘రొమాంటిక్ సీన్స్’ డోస్ ఏమాత్రం ఎక్కువైనా ఆ సినిమాల నుంచి తప్పుకుంటాను. ఈ మధ్య చేసే సినిమాల విషయంలో చిత్ర దర్శక, నిర్మాతలకు నేను ఓ కండిషన్ పెడుతున్నా. ఫిజికల్‌గా, వల్గర్‌గా ఉన్న సన్నివేశాల్లోనే నటించలేను అని చెప్పిన తర్వాతే నేను సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నా. ఎందుకంటే.. నేను చేసిన సినిమాలు చూసి నా కూతురు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. తను అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఆరాధ్య అంటే నాకు ప్రాణం. అందుకే అలాంటి సినిమాలకు నేను దూరంగా ఉంటున్నా అని చెప్పుకొచ్చారు అభిషేక్.