UK new coronavirus Strain: కొత్త రకం వైరస్‌పై ఫార్మా దిగ్గజం బయోఎన్‌ టెక్‌ కీలక వ్యాఖ్యలు..

ఇంతకాలం కరోనా మహమ్మారితో సతమతమైన జనానికి బ్రిటన్ కేంద్రంగా వెలుగుచూసిన స్ట్రెయిన్ వైరస్ కోరలు చాసేందుకు యత్నిస్తుంది. ఈ తరుణంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్‌ టెక్‌ కొత్త రకం వైరస్‌‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్‌-19 స్ట్రెయిన్‌కు టీకా మందును అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.

UK new coronavirus Strain: కొత్త రకం వైరస్‌పై ఫార్మా దిగ్గజం బయోఎన్‌ టెక్‌ కీలక వ్యాఖ్యలు..

Edited By:

Updated on: Dec 22, 2020 | 4:02 PM

BioNTech on Strain vaccine: ఇంతకాలం కరోనా మహమ్మారితో సతమతమైన జనానికి బ్రిటన్ కేంద్రంగా వెలుగుచూసిన స్ట్రెయిన్ వైరస్ కోరలు చాసేందుకు యత్నిస్తుంది. ఈ తరుణంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్‌ టెక్‌ కొత్త రకం వైరస్‌‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్‌-19 స్ట్రెయిన్‌కు టీకా మందును అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓ మీడియాతో పేర్కొన్నారు. ‘ఆరు వారాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌కు బయోఎన్‌టెక్‌ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు’ అని స్పష్టం చేశారు. మరోవైపు, కొవిడ్‌-19కు సంబంధించి ఇప్పటికే ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు రూపొందించిన ‘ఫైజర్‌ టీకా’ను అత్యవసర వినియోగానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అనుమతులు ఇచ్చాయి.

ఏడాది కాలంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మరికి విరుగుడు దొరికిందని భావిస్తున్న సమయంలో బ్రిటన్ పిడుగులాంటి వార్తను పేల్చింది. యూకేలో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలపై అంక్షలు విధించాయి. విమానాల ప్రయాణాలను రద్దు చేశాయి. భారత్‌ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయించింది. అంతేకాకుండా బ్రిటన్‌ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, ఐసోలేషన్‌ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది.